ఓపెన్ కాస్ట్ పద్ధతి

04:10 Unknown 0 Comments

                                          ఓపెన్ కాస్ట్ మైనింగ్ 


ఈ పద్దతిలో బండ మరియు మట్టిని తీసి మైనింగ్ కు గాని  నివాసం కు గాని ఉపయోగపడని ప్రదేశములో నిలువ చేస్తూ బొగ్గు నిక్షేపాలను వెలికి తీయుదురు.

ఓపెన్ కాస్ట్ విధానంలో ప్రధానంగా రెండు పద్దతులు ఉన్నాయి. 

1.మానవశక్తితో:

2. యంత్రముల సహకారంతో 

1. మానవశక్తితో: ఈ పద్ధతిలో మానవశక్తి ఎక్కువగా ఉపయోగించుదురు. చిన్న చిన్న డ్రిల్లు పరికరముతో హోల్స్ చేయుదురు. ఆ హోల్స్ లో ప్రేలుడు పదార్థములను ఉపయోగించి బ్లాస్టింగ్ చేయుదురు . ఆలా చేయగా వచ్చిన బండ ను ,మట్టిని ,మరియు బొగ్గు ను లాడిస్లు లో లేదా లోకోమొటీవ్స్   నందు కార్మికులతో నింపి వాటిని హాలర్ల  సహాయంతో బయటకు రవాణా  చేయుదురు. 
2.యంత్రముల సహకారంతో:  ఈ  పద్ధతిలో పెద్ద పెద్ద యంత్రములు అనగా డ్రాగ్ లైన్ ,షవేల్స్ ,హోల్ డ్రిల్ల్స్ డంపర్ లు మొదలైనవి ఉపయోగించుదురు. బ్లాస్టింగ్ హోల్స్ సుమారు 6మీ నుండి 18 మీ లోతు వరకు, మరియు 127మీ.మీ నుండి 254మీ.మీ. వ్యాసం తో హోల్స్ చేయుదురు. బండ ను లిక్విడ్ ఆక్సిజెన్ (lox),ఓపెన్ కాస్ట్ జలటిన్ మొదలైన హై ఎక్సప్లోజీవ్స్  తో బ్లాస్టింగ్ చేయుదురు. 

       మట్టి,బండ మరియు బొగ్గు ను డ్రాగ్ లైన్,షవేల్స్ సహాయం తో డంపర్ లో రవాన చేయుదురు.

ఓపెన్ కాస్ట్ గనులలోని రకములు:

  1. షవేల్స్, డంపర్ కాంబినేషన్ . 
  2. షవేల్స్, డంపర్,డ్రాగ్ లైన్ కాంబినేషన్ . 
  3. ఇన్ -పిట్ క్రషింగ్ విధానం. 
  4. బకెట్ వీల్ ఎస్కవేటర్. 

షవేల్స్, డంపర్ విధానములో ఉపయోగించు యంత్రములు :

  1. డిప్పర్ షవేల్
  2. హైడ్రాలిక్ షవేల్
  3. వెల్ హోల్ డ్రిల్ల్స్ 
  4. ట్రాక్టర్ షవేల్
  5. స్క్రాపర్ 
  6. డోజర్ 
  7. గ్రీడర్

 షవేల్స్, డంపర్,డ్రాగ్ లైన్ కాంబినేషన్ .

పై పద్దతిలో ఉపయోగించి యంత్రములతో పాటు డ్రాగ్ లైన్ కూడా ఉపయోగించుదురు. 

ఇన్ -పిట్ క్రషింగ్ విధానం. 

ఈ పద్దతిలో బొగ్గు లేదా మట్టిని డంపర్ ద్వారా కాకా కన్వేయర్ బెల్ట్ సహాయం తో రవాన చేయుదురు. బొగ్గు ను తగిన సైజు లో పిట్ లోపలనే క్రుషింగ్ చేయుదురు 


బకెట్ వీల్ ఎస్కవేటర్. 

ఈ పద్ధతిని నైవేలిలో ఉపయోగించుచునారు. ఈ పద్దతిలో ఒక చైన్ పై అమర్చిన బకెట్ ఒకదాని తరువాత ఒకటి బొగ్గు మట్టిని తోడి బెల్ట్ పైకి చేర్చి రవాణా చెయుధురు.

 

You Might Also Like

0 comments: