లాంగ్ వాల్ మరియు బోర్డు అండ్ పిల్లర్ పద్ధతుల విధానం.

03:39 Unknown 0 Comments

 బోర్డు అండ్ పిల్లర్ పద్ధతి :

  1. స్తంభాక్రుతిలో (పిల్లర్స్ ) బొగ్గును వదిలి వేస్తూ బొగ్గు పొరలలో మార్గాలను (లెవెల్ మరియు డిప్స్ )చేయటం ఈ పద్ధతిలో అనుసరిస్తున్న విధానం .
  2. స్తంభాక్రుతిలో (పిల్లర్స్ ) మరియు ,మార్గాలను (లెవెల్ మరియు డిప్స్ ) ను చేయడని డెవలప్మెంట్ దశ గా పిలుస్తారు .
  3.  తర్వాత దశలో స్తంభాక్రుతిలో (పిల్లర్స్ ) వదిలిన బొగ్గును తేసే దశను డీపిల్లరింగ్ దశ అంటారు. 

బోర్డు అండ్ పిల్లర్ డెవలప్మెంట్ దశ :

డెవలప్మెంట్ ఈ క్రింది తెలిపిన రెండు పని పద్ధతుల ద్వారా చేయవచ్చును . 
  1. హ్యాండ్ సెక్షన్ పద్ధతి :పని స్థలములలో(పేస్) బ్లాస్టింగ్ చేయుట వలన వచ్చిన బొగ్గు ను టబ్బులలో  నింపి హాలేజి ద్వారా పైకి తీసుకొని రావటనీ హ్యాండ్ సెక్షన్ పద్ధతి అంటారు
  2. యంత్రికరణ పద్ధతి : పని స్థలములలో(పేస్) బ్లాస్టింగ్ చేయుట వలన వచ్చిన బొగ్గు ను LHD/SDL ద్వారా బొగ్గును కన్వేయర్ బెల్ట్ మీదకు చేర్చి - బెల్ట్ కన్వేయర్ ద్వరా పైకి తీసుకొని వచ్చుట పద్ధతిని యంత్రికరణ పద్ధతి అంటారు . 

బోర్డు అండ్ పిల్లర్ డీపిల్లరింగ్ దశ :

డీపిల్లరింగ్ లో రెండు విధానాలుఉన్నాయి . 
  1. కేవింగ్ 
  2. స్టోవింగ్ 

లాంగ్ వాల్ పద్ధతి :

లాంగ్ వాల్ పద్దతిలో 60మీ. నుండి 200మి. పొడవు గల ఫేసు ను తయారు చేయటం జరుగుతుంది. ఒక వరుస క్రమములో నడిచే పనులతో ఉత్పతిని తీస్తారు. ఫేసు  ముందుకు నడిచిన కొద్ది వెనుక గోఫ్ మిగులును. 

ఇందులో ప్రధానంగా రెండు పద్దతులు ఉన్నాయి. 
  1. లాంగ్ వాల్ అడ్వంసింగ్(advancing): హాలేజి రోడ్డుల నుండి మొదలు పెట్టి గని సరిహద్దుల వైపునకు ఫేసు ను నడుపుదురు . 
  2. లాంగ్ వాల్ రిట్రీట్ ఇంగ్(retreating ):  గని సరిహద్దుల నుండి మొదలు పెట్టి హాలేజి రోడ్డుల వైపునకు ఫేసు ను నడుపుదురు .

    గోఫ్ :

    పిల్లర్ లను (బొగ్గును)తీసివేసిన ప్రదేశాన్ని గోఫ్ అంటారు.



                                                                                         ఓపెన్ కాస్ట్ పద్ధతి తరువాయి ఆర్టికల్  లో... 

You Might Also Like

0 comments: